మాస్ మహారాజ్ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు!
- 'క్రాక్'తో హిట్ కొట్టిన రవితేజ
- షూటింగు దశలో 'ఖిలాడి'
- కామెడీ ఎంటర్టైనర్ గా త్రినాథరావు సినిమా
ఇక నక్కిన త్రినాథరావు కూడా మాస్ పల్స్ తెలిసిన దర్శకుడే. 'సినిమా చూపిస్త మావ' .. 'నేను లోకల్' సినిమాలు చూస్తే, ఆయన ఎంచుకునే కథలు రవితేజ స్టైల్ కి దగ్గరగా ఉంటాయనిపిస్తుంది. రవితేజ బాడీలాంగ్వేజ్ కి తగిన కథను ఎంచుకున్న ఆయన కూడా, త్వరలో ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించే పనుల్లోనే ఉన్నాడు. కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు కథనాయికలు ఉంటారట. ఆ పాత్రల కోసం ప్రియాంక అరుళ్ మోహన్ - నభా నటేశ్ లను తీసుకున్నారని తెలుస్తోంది. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా నుంచి త్వరలో మిగతా వివరాలు తెలియనున్నాయి.