రంభ అభిమానిగా జగపతిబాబు .. ఆమె కటౌట్స్ పై స్పెషల్ సాంగ్!
- చిత్రీకరణ దశలో 'మహాసముద్రం'
- విభిన్నమైన పాత్రలో జగపతిబాబు
- నో చెప్పిన రకుల్ .. కాజల్ .. శ్రుతి
ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉందట .. దానిని స్టార్ హీరోయిన్ కాంబినేషన్లో చిత్రీకరిస్తే బాగుంటుందని అజయ్ భూపతి భావించాడట. అందుకోసం ఆయన కాజల్ .. రకుల్ .. శ్రుతి హాసన్ లతో సంప్రదింపులు జరిపాడని అంటున్నారు. వాళ్లంతా కూడా నో చెప్పారట. దాంతో జగపతిబాబు పాత్రకు ఆయన రంభకి అభిమాని అనే చిన్న అంశాన్ని జోడించి, ఆమె సినిమాల్లోని కటౌట్స్ పై స్పెషల్ సాంగ్ ను లాగించేశారట. రంభ కటౌట్ల మధ్య జగపతిబాబు .. శర్వానంద్ పై ఈ సాంగ్ నడుస్తుందన్న మాట. ఈ సాంగ్ చాలా బాగా వచ్చిందని అంటున్నారు. హీరోయిన్లకు కోట్ల రూపాయలు కుమ్మరించడం కంటే, కటౌట్లతో కానిచ్చేసే పనేదో బాగానే ఉంది కదూ!