మరోసారి పవన్ ను ఒప్పించిన దిల్ రాజు!
- 'వకీల్ సాబ్'తో దక్కిన హిట్
- పవన్ కి తిరుగులేని రీ ఎంట్రీ
- పవన్ కి అడ్వాన్స్ ఇచ్చిన దిల్ రాజు
అయితే చాలాకాలంగా పవన్ తో అనుకున్న ప్రాజెక్టులు పక్కలకి వెళుతూ వచ్చాయి. మొత్తానికి పవన్ తో సినిమా చేయాలనే తన ముచ్చటను ఆయన 'వకీల్ సాబ్' తో తీర్చుకున్నారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో, పవన్ మళ్లీ ఈ బ్యానర్లో చేయడానికి సిద్ధమవుతున్నాడట.
మంచి కథతో .. మంచి డైరెక్టర్ తో కలుస్తానని చెప్పిన దిల్ రాజు, ఆయనకి అడ్వాన్స్ కూడా అందజేశారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం క్రిష్ .. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సినిమాలు చేస్తున్న పవన్, ఆ వెంటనే హరీశ్ శంకర్ - సురేందర్ రెడ్డి లతో చేయనున్నాడు. ఆ తరువాతనే దిల్ రాజు ప్రాజెక్టు ఉంటుందన్న మాట.