మొయినాబాద్ రిసార్టులో 'అఖండ'
- భారీ బడ్జెట్ చిత్రంగా 'అఖండ'
- విభిన్నమైన గెటప్స్ లో బాలయ్య
- ప్రతినాయకుడి పాత్రలో శ్రీకాంత్
ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను 'వికారాబాద్' అడవుల్లో చిత్రీకరించారు. బాలకృష్ణ - శ్రీకాంత్ తదితరులు పాల్గొనగా, భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. తాజాగా ఈ సినిమా షూటింగు మొయినాబాద్ లో జరుగుతోంది. అక్కడి రిసార్టులో బాలయ్య - ప్రగ్యా జైస్వాల్ కాంబినేషన్ లోని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. బాలకృష్ణగారితో కలిసి నటించే అవకాశం లభించడం తన అదృష్టమనీ, కరోనాకి సంబంధించి అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నామని ప్రగ్యా జైస్వాల్ చెప్పింది.