యథార్థ సంఘటన ఆధారంగా రవితేజ కొత్త సినిమా!
- రవితేజ తాజా చిత్రంగా 'ఖిలాడి'
- తదుపరి సినిమాకి సన్నాహాలు
- లైన్లో కొత్త దర్శకుడు శరత్ మండవ
ప్రస్తుతం రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ 'ఖిలాడి' సినిమా చేస్తున్నాడు. తాజాగా వదిలిన టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా తరువాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమా కూడా పూర్తయిన తరువాత, శరత్ మండవ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో ఇద్దరు నాయికలు ఉండనున్నట్టు తెలుస్తోంది. మరి రవితేజ సరసన నాయికలుగా ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.