సిద్ధార్థ్ హీరోగా 'ఒరేయ్ బామ్మర్ది' .. టీజర్ రిలీజ్
- 'బిచ్చగాడు' దర్శకుడి నుంచి మరో సినిమా
- ఆకతాయి కుర్రాడిగా జీవీ ప్రకాశ్ కుమార్
- ట్రాఫిక్ పోలీస్ పాత్రలో సిద్ధార్థ్
సిద్ధార్థ్ తో పాటు ఈ సినిమాలో జీవీ ప్రకాశ్ కుమార్ కూడా మరో హీరోగా నటించాడు. 'ఒరేయ్ బామ్మర్ది' టైటిల్ తో ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. సిద్ధార్థ్ ట్రాఫిక్ పోలీస్ గా నటించగా, బెట్టింగులు వేసి .. ట్రాఫిక్ రోడ్లపై బైక్ నడిపే ఆకతాయిగా జీవీ ప్రకాశ్ కుమార్ కనిపిస్త్తున్నాడు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత బాలాజీ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఇక్కడ ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.