మిర్యాలగూడ వాసికి అమెరికాలో అరుదైన గౌరవం.. ‘కామ్స్కోప్’ సీఐవోగా జొన్నలగడ్డ ప్రవీణ్
- 12 ఏళ్లుగా వివిధ హోదాల్లో సేవలు
- సంస్థలోని 50 మంది సాంకేతిక నిపుణుల్లో ముఖ్యుడు
- ఉస్మానియ యూనివర్సిటీ నుంచి ఏఐలో పీహెచ్డీ
మిర్యాలగూడ మండలంలోని గూడూరుకు చెందిన ప్రవీణ్ అక్కడే గణితంలో బీఎస్సీ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ చేశారు. 2001లో అదే యూనివర్సిటీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) లో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత వివిధ సంస్థల్లో పనిచేసిన ప్రవీణ్ 12 ఏళ్ల క్రితం కామ్స్కోప్లో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ఇప్పుడు ఆ సంస్థకు సీఐవోగా నియమితులయ్యారు.