'శాకుంతలం' సెట్లో కోలీవుడ్ నటి!
- సమంత ప్రధానపాత్రధారిణిగా 'శాకుంతలం'
- పాన్ ఇండియా సినిమా స్థాయిలో నిర్మాణం
- వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు
కథ ప్రకారం శకుంతలకి అనసూయ - ప్రియంవద అనే ఇద్దరు స్నేహితురాళ్లు ఉంటారు. వాళ్లలో అనసూయ పాత్రకి ఈషా రెబ్బాను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇక మరో ముఖ్యమైన పాత్రకి గాను తమిళనటి 'అదితి బాలన్'ను తీసుకున్నారు. ఆల్రెడీ షూటింగులో ఆమె పాల్గొంటోందని అంటున్నారు. తమిళంలో సహజనటిగా ఆమెకి మంచి గుర్తింపు ఉంది. అయితే 'శాకుంతలం'లో ఆమె ప్రియంవద పాత్ర చేస్తుందా? లేదంటే 'కణ్వ మహర్షి' ఆశ్రమంలో శకుంతలకి పెద్ద దిక్కుగా ఉండే గౌతమి పాత్ర చేస్తోందా? అనేది తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.