థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో ఓటేసిన రజనీకాంత్.. తేనాంపేటలో కమలహాసన్
- పలు రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్
- తమిళనాడులో ఒకే విడతలో ఎన్నికలు
- అసోం, పశ్చిమ బెంగాల్లో మూడో విడత పోలింగ్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలోని స్టెల్లా మేరీస్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమలహాసన్ తన కుమార్తెలు అక్షర హాసన్, శ్రుతి హాసన్‌లతో కలిసి చెన్నైలోని తేనాంపేట హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మరోవైపు, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, పుదుచ్చేరిలోనూ నేడు ఎన్నికలు జరగుతుండగా, అసోం, పశ్చిమ బెంగాల్‌లలో మూడో విడత పోలింగ్ జరుగుతోంది.