రజనీకాంత్ కు కేంద్రం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తెలుగు నిర్మాతల మండలి
- రజనీకాంత్ కు దాదాసాహెబ్ పురస్కారం
- స్పందించిన తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి
- ప్రకటన విడుదల చేసిన గౌరవ కార్యదర్శులు
- రజనీకాంత్ కు హృదయపూర్వక అభినందనలు తెలిపిన మండలి
రజనీకాంత్ కు 2020 ఏడాదికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించడం హర్షణీయమని పేర్కొన్నారు. ఆయన భారత్, జపాన్, సింగపూర్, మలేషియా తదితర దేశాల్లో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నారని, భారత కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ద్వారా ఆయనను మరింత గౌరవించిందని వివరించారు.