నీలం సాహ్నీకి అభినందనలు... గవర్నర్ ను ఎందుకు కలవలేకపోయానంటే..: నిమ్మగడ్డ
- గవర్నర్ వైద్య పరీక్షలకు వెళ్లారు
- సమయం ఉంటే పరిషత్ ఎన్నికలూ జరిపేవాళ్లం
- హక్కుల సాధనకు పోరాడతానన్న నిమ్మగడ్డ
ప్రభుత్వ సహకారం, సీఎస్, డీజీపీలతో పాటు ఉద్యోగులు అందించిన తోడ్పాటుతో స్థానిక ఎన్నికలను విజయవంతం చేశామని చెప్పిన ఆయన, సమయం ఉంటే పరిషత్ ఎన్నికలను కూడా నిర్వహించి వుండేవాళ్లమని, అయితే, తనకు అంత సమయం లేకపోయిందని అన్నారు.
తనకు గతంలో తెలంగాణలో ఓటు హక్కు ఉండేదని, దాన్ని స్వగ్రామానికి మార్చుకుందామని భావించానని, తన ఓటును తాను మార్చుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడి నుంచైనా ఒకసారి ఓటు వేసే హక్కు ప్రతి ఒక్క పౌరుడికీ ఉందని, తన హక్కుల సాధనకు ఓ సామాన్య పౌరుడిగా రేపటి నుంచి పోరాడతానని, ఈ విషయంలో హైకోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని అన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.