మందు కొట్టిన ఉన్మాది చర్యకు... కేపీహెచ్బీ ఏఎస్ఐ మహీపాల్ రెడ్డి కన్నుమూత!
- ఈ నెల 27న గాయపడ్డ మహీపాల్ రెడ్డి
- మద్యం తాగి వస్తూ ఢీ కొట్టిన క్యాబ్ డ్రైవర్
- ఈ ఉదయం ఆసుపత్రిలో కన్నుమూత
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహీపాల్ రెడ్డిని, ఆసుపత్రికి తరలించినా, ఆయన ప్రాణాలు మిగల్లేదు. ఈ ఉదయం పరిస్థితి విషమించి ఆయన మరణించారు. మహీపాల్ రెడ్డి అవయవాలను దానం చేయాలని కుటుంబీకులు నిర్ణయించారు. ఆయన అంత్యక్రియలు నేటి సాయంత్రం స్వగ్రామంలో జరుగనున్నాయి. మహీపాల్ మరణంపై పోలీసు శాఖ ఉన్నతాధికారులు సంతాపం తెలిపారు.