మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం: బొత్స స్పష్టీకరణ
- పరిపాలన రాజధానిని ఏ క్షణమైనా విశాఖకు తరలిస్తాం
- అభివృద్ధి అవకాశాలను చంద్రబాబు నాశనం చేశారు
- అమరావతిని ఓ వర్గానికి రాజధానిగా మార్చారు
పరిపాలన రాజధానిని ఏ క్షణమైనా విశాఖకు తరలిస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఉన్న అవకాశాలను చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్న ఐదేళ్లలో నాశనం చేశారని విమర్శించారు. అమరావతిని ఓ వర్గానికి చెందిన రాజధానిగా మార్చి అభివృద్ధిని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు అడ్డంకులు తొలగిపోగానే విలీన గ్రామాలతో కలిపి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి వివరించారు.