'సలార్' కాంబినేషన్లో మరో సినిమా.. ప్రముఖ నిర్మాత ప్లానింగ్?
- ప్రభాస్, ప్రశాంత్ కాంబోలో 'సలార్'
- ఇదే కలయికలో దిల్ రాజు సినిమా
- ప్రస్తుతం చర్చల దశలో ప్రాజక్టు
ఇదిలావుంచితే, 'సలార్' చిత్రం ఇంకా నిర్మాణ దశలో ఉండగానే ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో మరో చిత్రాన్ని నిర్మించడానికి అప్పుడే సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు మళ్లీ ఈ కాంబోని సెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ కూడా ఈ ప్రాజక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం ఈ ప్రాజక్టు చర్చల దశలో వుందని అంటున్నారు.
అయితే, ఇప్పుడు ప్రభాస్ ఇప్పటికే కమిట్ అయిన తన ప్రాజక్టులతోను, ప్రశాంత్ తన ప్రాజక్టులతోను ఎవరికి వారు బిజీగా వున్నారు. ఇప్పుడు దిల్ రాజు ప్రాజక్టు పట్టాలెక్కాలంటే మరికొంత సమయం పడుతుందన్న మాట!