బిగ్ ఆఫర్ కొట్టిన 'జాతిరత్నాలు' కథానాయిక?
- యూత్ ని ఆకట్టుకుంటున్న 'జాతిరత్నాలు'
- చిత్ర కథానాయిక ఫరియాకు పలు ఆఫర్లు
- తదుపరి చిత్రానికి సిఫార్సు చేసిన రవితేజ
- త్రినాథరావు నక్కిన చిత్రంలో అవకాశం
ప్రస్తుతం 'ఖిలాడి' సినిమాలో నటిస్తున్న రవితేజ దీని తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇందులో కథానాయిక పాత్రకు ఫరియాను బుక్ చేయాల్సిందిగా రవితేజ దర్శక నిర్మాతలకు సూచించాడట. మంచి హైటూ.. అందం.. అభినయం ఉండడంతో ఫరియా తన పక్కన బాగుంటుందని రవితేజ భావిస్తున్నాడట. దీంతో దర్శక నిర్మాతలు ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇదేకాకుండా మరికొన్ని ఆఫర్లు కూడా ఆమెకు వస్తున్నట్టు చెబుతున్నారు.