'రాధే శ్యామ్' సినిమాలో 'పోటుగాడు' భామ!
- 'పోటుగాడు'లో నటించిన సిమ్రన్ కౌర్
- ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ టాలీవుడ్ కి
- 'రాధే శ్యామ్' టీమ్ నుంచి ఫోన్ కాల్
- కీలకమైన పాత్ర చేశానన్న సిమ్రన్
రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'రాధే శ్యామ్' పేరిట ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందుతున్న సంగతి విదితమే. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ చిత్రంలో సిమ్రన్ కౌర్ ఓ ముఖ్య పాత్ర పోషించింది. దీని గురించి 'ఈ చిన్నది చెబుతూ, ఆమధ్య 'రాధేశ్యామ్' టీమ్ నుంచి కాల్ వచ్చింది. ఓ క్యారెక్టర్ వుంది చేస్తారా? అని అడిగారు. వెంటనే ఒప్పేసుకున్నాను. ఇందులో నాది కీలమైన మంచి పాత్ర, ఇందులో నటించినందుకు హ్యాపీగా వుంది' అని చెప్పింది.