ప్రిన్స్ హ్యారీని పెళ్లాడి ఇబ్బందులు పడ్డానన్న మేఘన్.. జాత్యహంకారానికి తావు లేదన్న బ్రిటన్!
- రాజకుటుంబం నుంచి దూరమైన హ్యారీ-మేఘన్ దంపతులు
- ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించిన మర్కెల్
- పుట్టబోయే బిడ్డ శరీర రంగు గురించి చర్చ జరిగిందని ఆవేదన
ఈ సందర్భంగా మేఘన్ మాట్లాడుతూ హ్యారీని పెళ్లాడాక రాజ కుటుంబంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు. తాను గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టబోయే బిడ్డ శరీర రంగు గురించి ఎడతెగని చర్చ జరిగిందని పేర్కొన్నారు. బిడ్డ నల్లగా పుడుతుందేమోనన్న ఆందోళన రాజ కుటుంబంలో వ్యక్తమైందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఇంటర్వ్యూపై స్పందించిన బ్రిటన్ మంత్రి విక్కీ ఫోర్డ్ తమ దేశంలో జాత్యహంకారానికి తావు లేదని స్పష్టం చేశారు.