పీవీ నరసింహారావు కుమార్తెకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్
- తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
- హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ అభ్యర్థిగా సురభి వాణీదేవి
- వాణీదేవి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సీఎం కేసీఆర్
- ఎల్లుండితో ముగియనున్న నామినేషన్ ప్రక్రియ
- మార్చి 14న పోలింగ్
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఈ నెల 23 తుది గడువు. మార్చి 14న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 17న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును ఇప్పటికే ప్రకటించారు.