జై తెలంగాణ అంటూ షర్మిల నినాదాలు!
- వైయస్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం
- ప్రజలకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ నెరవేర్చిందా? అని ప్రశ్న
- తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామని వ్యాఖ్య
రైతులు, విద్యార్థులు, పేదలకు ఉపయోగపడేలా దివంగత వైయస్సార్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చారని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో మళ్లీ రాజన్న కాలంనాటి స్వర్ణయుగాన్ని తెచ్చుకుందామని చెప్పారు. కులమతాలకు అతీతంగా వైయస్ పాలించారని అన్నారు. 11 ప్రశ్నలతో ఉన్న ఫీడ్ బ్యాక్ ఫామ్ ని నింపాలని అభిమానులను ఆమె కోరారు.