డేట్స్ అటు ఇటు సర్దుబాటు చేస్తున్న ప్రభాస్!
- తొలిషెడ్యూలు షూటింగ్ పూర్తయిన 'సలార్'
- 'ఆదిపురుష్' సెట్లో అగ్నిప్రమాదం.. ఆగిన షూట్
- 'సలార్'కు, నాగ్ అశ్విన్ చిత్రానికి డేట్స్ సర్దుబాటు
ఇదే సమయంలో ముంబయ్ లో 'ఆదిపురుష్' కూడా మొదలైంది. అయితే, ఆ చిత్రం సెట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో ఇప్పుడు షూటింగ్ అప్ సెట్ అయింది. ఈ సినిమా కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని పరికరాలు ఆ అగ్ని ప్రమాదంలో పాడయ్యాయట. వాటిని మళ్లీ విదేశాల నుంచి తెప్పించాల్సివుంది.
ఆ కారణంగా 'ఆదిపురుష్' షూటింగ్ తాత్కాలికంగా ఆగింది. దీంతో ఈ సినిమాకి కేటాయించిన డేట్లు వృథా కాకుండా.. ఆ డేట్లను 'సలార్'కు, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న చిత్రానికీ ప్రభాస్ కేటాయిస్తున్నాడని తెలుస్తోంది. అలా 'ఆదిపురుష్'కి విఘ్నం కలగడంతో మిగతా రెండు సినిమాలకీ అనుకోకుండా డేట్స్ వచ్చాయన్నమాట!