భారీ స్థాయిలో వెండితెరకు రామాయణం.. శ్రీరాముడి పాత్రలో మహేశ్!
- మూడు భాగాలుగా రామాయణం నిర్మాణం
- 1500 కోట్ల భారీ బడ్జెట్టు కేటాయింపు
- నితీశ్ తివారి, రవి ఉడయార్ దర్శకత్వం
- సీతగా దీపిక.. రావణుడిగా హృతిక్
- నిర్మాతలుగా అల్లు అరవింద్, మధు మంతెన
'దంగల్' వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన నితీశ్ తివారీ, 'మామ్' చిత్ర దర్శకుడు రవి ఉడయార్ కలసి సంయుక్తంగా ఈ ప్రాజక్టుకు దర్శకత్వం వహిస్తారు. మొత్తం మూడు భాగాలుగా హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించడానికి డిజైన్ చేస్తున్నారు. 1500 కోట్ల భారీ బడ్జెట్టుతో ఈ చిత్రాలను అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించడానికి సిద్ధమయ్యారు.
ఇక ఇందులో వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటులు ఆయా పాత్రలను పోషిస్తారు. ఈ క్రమంలో శ్రీరాముడి పాత్రను మహేశ్ బాబు పోషిస్తాడని తాజాగా తెలుస్తోంది. సీతాదేవి పాత్రను దీపిక పదుకొణే పోషించే అవకాశం వుంది. ఇక మరో కీలక పాత్ర రావణుడి పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ధరిస్తాడని సమాచారం.