మహిళా డైరెక్టర్ తో మహేశ్ ప్రాజక్ట్?
- 'సర్కారు వారి పాట' షూటింగులో మహేశ్
- 'ఆకాశం నీ హద్దురా'తో సుధ కొంగరకు హిట్
- మహేశ్ కోసం కథ తయారుచేసిన సుధ
- ప్రస్తుతం చర్చల దశలో వున్న ప్రాజక్టు
ఇటీవల సూర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో 'ఆకాశం నీ హద్దురా' అనే చిత్రం వచ్చింది. ఓటీటీలో రిలీజైన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దీనికి మొదటి నుంచీ తమిళంలోనే తన కెరీర్ని కొనసాగిస్తున్న తెలుగు మహిళ సుధ కొంగర దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మహేశ్ కి బాగా నచ్చడంతో ఈ దర్శకురాలితో ఓ ప్రాజక్ట్ చేయాలని అనుకుంటున్నారట.
ఈ క్రమంలో ఇప్పటికే మహేశ్ ఇమేజ్ కి తగ్గ పవర్ ఫుల్ సబ్జెక్టును సుధ కొంగర తయారుచేశారనీ, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయనీ తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ ఓ భారీ సినిమా చేయాల్సివుంది. దానికి ముందుగా.. 'సర్కారు వారి పాట' పూర్తయిన తర్వాత సుధ కొంగర దర్శకత్వంలో చిత్రం సెట్స్ కి వెళ్లచ్చని సమాచారం.