టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లతో దాడికి దిగిన బీజేపీ కార్యకర్తలు
- అయోధ్య రామమందిరంపై వ్యాఖ్యలు చేశాడంటూ ఆరోపణ
- నక్కలగుట్టలోని ఎమ్మెల్యే నివాసంపై దాడి
- పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు
- పలువురు బీజేపీ నేతల అరెస్ట్
- మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టీఆర్ఎస్ శ్రేణులు
కాగా, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై దాడి జరిగిందన్న సమాచారంతో టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. పరకాల పట్టణంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. ఎమ్మెల్యే నివాసంపై దాడికి దిగిన బీజేపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.