ఏప్రిల్ నాటికి అమెరికాను యూకే వేరియంట్ కరోనా బెంబేలెత్తిస్తుంది: ఆంటోనీ ఫౌజీ
- యూకే నుంచి పలు దేశాలకు పాకిన కొత్త కరోనా వైరస్
- అమెరికాలో 28 రాష్ట్రాలకు విస్తరించిన వైరస్
- అమెరికాలో నెమ్మదిగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్
యూకే వైరస్ ఇప్పటికే అమెరికాలోని దాదాపు 28 రాష్ట్రాలకు వ్యాపించింది. ఇప్పటికే 315 కేసులు నమోదయ్యాయి. మరోవైపు అమెరికాలో ఇప్పటి వరకు 2.89 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఒక డోసు ఇచ్చారు. అయితే వ్యాక్సినేషన్ అనుకున్న దానికంటే నెమ్మదిగా కొనసాగుతోందనే విమర్శలు వస్తున్నాయి.