పవన్, రానా లపై యాక్షన్ దృశ్యాల చిత్రీకరణ
- మలయాళ సినిమా రీమేక్ లో పవన్, రానా
- ఈ నెల 25 నుంచి హైదరాబాదులో షూటింగ్
- నేడు షూటింగులో జాయిన్ అయిన రానా
- స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చిన త్రివిక్రమ్
ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25 నుంచి హైదరాబాదులో జరుగుతోంది. ఈ క్రమంలో ఈ రోజు రానా దగ్గుబాటి కూడా షూటింగులో జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. పవన్, రానా కాంబినేషన్లో ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పది రోజుల పాటు ఈ దృశ్యాల చిత్రీకరణ సాగుతుందని తెలుస్తోంది.
ఈ చిత్రంలో పోలీసాఫీసర్ పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తుండగా, ఆయనను ఢీకొట్టే పాత్రలో రానా నటిస్తున్నాడు. ఇక కథానాయికగా సాయిపల్లవిని ఎంపిక చేశారంటూ ఇటీవల వార్తలు వచ్చినప్పటికీ, అధికారికంగా మాత్రం ఇంకా ధ్రువీకరించలేదు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చడం ఓ విశేషం.