'క్రాక్' సినిమా దర్శకుడికి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్!
- 'క్రాక్'తో హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని
- స్టార్ హీరోల నుంచి వస్తున్న ఆఫర్లు
- గోపీచంద్ కథకు ఓకే చెప్పిన బాలయ్య
- బోయపాటి సినిమా తర్వాత సెట్స్ కు
ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ నుంచి కూడా గోపీచంద్ కు ఆఫర్ వచ్చింది. బాలకృష్ణను దృష్టిలో పెట్టుకుని తయారుచేసిన పక్కా మాస్ ఎంటర్ టైనర్ కథను తాజాగా ఆయనకు చెప్పాడనీ, బాగా నచ్చడంతో వెంటనే బాలయ్య ఈ ప్రాజక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనీ తెలుస్తోంది.
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ తన తాజా చిత్రాన్ని చేస్తున్న విషయం విదితమే. ఇది పూర్తికాగానే గోపీచంద్ సినిమా మొదలవుతుందని సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పలు భారీ చిత్రాలను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.