‘మాస్టర్’ కోసం ‘క్రాక్’ను లేపేస్తారా?: దిల్‌రాజుపై డిస్ట్రిబ్యూటర్ మండిపాటు
- తెలుగు సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని గతంలో ఆయనే చెప్పారు
- ఆయన పేరును కిల్రాజుగా మార్చాలి
- మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమాను లేపేయడం దారుణం
సంక్రాంతి రోజున తెలుగు సినిమాలకు కాకుండా, తమిళ సినిమాలకు ప్రాధాన్యం ఎలా ఇస్తారని ప్రశ్నించిన ఆయనే ఇప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. క్రాక్ సినిమాకు టాక్ బాగుందని, అందుకే ఇలా మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమాను థియేటర్ల నుంచి తీసేయడం తనను ఆవేదనకు గురిచేసిందని డిస్ట్రిబ్యూటర్ శ్రీను అన్నారు.