జల్లికట్టులో రాహుల్ గాంధీ సందడి... తమిళ సంస్కృతిని కించపరిచే వాళ్లకు సందేశం ఇవ్వడానికే వచ్చానని వెల్లడి
- తమిళనాడులో జల్లికట్టు షురూ
- మధురై జిల్లా అవనియపురంలో పోటీలు
- ముఖ్య అతిథిగా విచ్చేసిన రాహుల్ గాంధీ
- తమిళులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని వెల్లడి
ఈ సందర్భంగా రాహల్ గాంధీ మాట్లాడుతూ, అటు ఎద్దులకు, ఇటు పోటీదారులకు ఏమాత్రం ఆపద వాటిల్లని విధంగా భద్రత ఏర్పాట్లు చేశారంటూ నిర్వాహకులను అభినందించారు. భారతదేశ భవిష్యత్తుకు తమిళ సంస్కృతి, చరిత్ర ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని అందరూ గౌరవించాలని సూచించారు. తమిళ ప్రజల సంస్కృతిని కించపరిచేవాళ్లకు, తమిళులను, వారి భాషను, వారి ఘనతర వారసత్వాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించేవారికి సందేశం ఇవ్వడానికే తాను జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొంటున్నానని తెలిపారు. తమిళులకు ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందని రాహుల్ వెల్లడించారు. కాగా ఈ కార్యక్రమంలో తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ కూడా పాల్గొన్నారు.