అఖిలప్రియ బెయిల్ పిటిషన్ తిరస్కరణ.. మూడు రోజుల పోలీసు కస్టడీ
- బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏ1గా అఖిలప్రియ
- రిమాండ్ ఖైదీగా ఉన్న ఏపీ మాజీ మంత్రి
- నేటి నుంచి 13 వరకు పోలీసుల కస్టడీ
దర్యాప్తులో పురోగతి కోసం ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే, నేటి నుంచి ఈ నెల 13 వరకే ఆమెను పోలీసుల కస్టడీకి అనుమతి ఇస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. కాగా, మెరుగైన వైద్యం కోసం తనను ఆసుపత్రికి తరలించాలని అఖిలప్రియ ఇంతకు ముందు పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. జైలులోనే అందుబాటులో వైద్యులు, తగిన వైద్య సదుపాయాలు ఉన్నాయని పేర్కొంది.