బీజేపీ నేతలు తమ స్థాయికి మించి మాట్లాడుతున్నారు: మంత్రి ప్రశాంత్ రెడ్డి
- సీఎంపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించబోమన్న మంత్రి
- కేసీఆర్ ను జైల్లో పెట్టే ధైర్యం ఉందా అంటూ వ్యాఖ్యలు
- బీజేపీని రైతులు తరిమికొడతారని స్పష్టీకరణ
- కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా తీసుకురావాలని సవాల్
బీజేపీని రైతులు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. 5 రోజుల్లో పసుపు బోర్డు మంజూరు చేయిస్తామని చెప్పి రైతులను మోసం చేసిన బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీకి కావాల్సింది ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమేనని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ నేతలకు చేతనయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలని సవాల్ విసిరారు.