సతీ సమేతంగా మెగాస్టార్ చిరంజీవిని కలిసిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేమ్ సుధాకర్
- తన భార్యతో కలిసి చిరు పాటకు డ్యాన్స్ చేసిన సుధాకర్
- వీడియో చూసి అభినందించిన మెగాస్టార్
- ఇవాళ తన ఇంటికి వచ్చిన జంటకు హార్దిక స్వాగతం
- భవిష్యత్ లో అండగా ఉంటానని వెల్లడి
తాజాగా, సుధాకర్ తన అర్ధాంగి హారికతో కలిసి చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశాడు. తన ఇంటికి వచ్చిన ఆ యువజంటను చిరు హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఇందువదన పాటకు వారు చేసిన డ్యాన్స్ ను ఆయన ప్రశంసించారు. భవిష్యత్ లో వారి ప్రయత్నాలకు తాను అండగా ఉంటానని తెలిపారు.