బీజేపీలో చేరబోతున్నా: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన ప్రకటన
- న్యూ ఇయర్ సందర్భంగా తిరుమలకు రాజగోపాల్‌రెడ్డి
- తన సోదరుడు మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని స్పష్టీకరణ
- తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఉద్ఘాటన
తాను బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించిన కోమటిరెడ్డి తన సోదరుడు వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని చెప్పారు. పార్టీలు వేరైనా అన్నదమ్ములగా కలిసే ఉంటామన్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ విషయమై మాట్లాడుతూ కొత్త అధ్యక్షుడిని కాలమే నిర్ణయిస్తుందన్నారు. కేసీఆర్ ఒంటెద్దు పోకడలను మానుకోవాలని, ప్రతిపక్షాలను కలుపుకుని పోవాలన్న కోమటిరెడ్డి.. ఏపీ సీఎం జగన్ గురించి మాట్లాడుతూ తండ్రికి తగ్గ కొడుకు కావాలని అభిలషిస్తున్నట్టు తెలిపారు.