రెండో రోజు కూడా వసూళ్ల దుమ్మురేపిన 'సోలో బ్రతుకే సో బెటర్'
- కిస్మస్ నాడు రిలీజైన సాయితేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్'
- తొలిరోజు రూ.4 కోట్లకు పైగా కలెక్షన్లు
- రెండో రోజూ అదే ఒరవడి
- రూ.3.29 కోట్ల గ్రాస్ వసూలు
అటు, తెలుగు రాష్ట్రాల్లో రెండ్రోజుల షేర్ రూ.4.8 కోట్లు సాధించింది. మొత్తమ్మీద సాయితేజ్ కొత్త చిత్రం రెండ్రోజుల్లో రూ.7.99 కోట్ల గ్రాస్ తో నిర్మాతలను ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతోంది. అది కూడా 50 శాతం ప్రేక్షకులతోనే ఈ ఘనత సాధించడం విశేషం అని చెప్పాలి. కరోనా లాక్ డౌన్ ఆంక్షల సడలింపు అనంతరం థియేటర్లలో విడుదలైన తొలి తెలుగు చిత్రం సోలో బ్రతుకే సో బెటర్.