తెలుగులో కన్నడ సినిమా రీమేక్.. హీరోగా సునీల్!
- హీరోగా సక్సెస్ కాలేకపోయిన సునీల్
- మళ్లీ కామెడీ, విలన్ పాత్రల పోషణ
- తెలుగులో కన్నడ 'బెల్ బాటమ్' రీమేక్
- రిషబ్ శెట్టి పాత్రకు సునీల్ ఎంపిక
ఈ క్రమంలో ఈ హాస్యనటుడు ఓ కన్నడ సినిమా తెలుగు రీమేక్ లో కథానాయకుడుగా నటించనున్నట్టు తెలుస్తోంది. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో ఇటీవల కన్నడలో రూపొందిన 'బెల్ బాటమ్' సినిమా ఓటీటీ ద్వారా విడుదలై, మంచి కామెడీ సినిమాగా రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ చిత్రకథ, అందులోని పాత్ర సునీల్ కు బాగా సూటవుతాయన్న ఉద్దేశంతో ఆయనను హీరోగా ఎంచుకున్నట్టు చెబుతున్నారు. ఈ ప్రాజక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.