హన్సిక ప్రధాన పాత్రలో 'నషా' వెబ్ సీరీస్
- సినిమాలు తగ్గడంతో ఓటీటీకి హన్సిక
- అమెజాన్ ప్రైమ్ కోసం 'నషా' వెబ్ సీరీస్
- 'పిల్ల జమీందార్' ఫేమ్ అశోక్ దర్శకత్వం
- హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్
తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించిన హన్సికకు సినిమాల పరంగా ఇప్పుడు డిమాండ్ తగ్గింది. దీంతో ఈ ముద్దుగుమ్మ వెబ్ సీరీస్ ను ఎంచుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా అమెజాన్ ప్రైమ్ కోసం ఓ సీరీస్ చేసింది.
'పిల్ల జమీందార్' ఫేమ్ అశోక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీరీస్ కి 'నషా' టైటిల్ని ఖరారు చేశారు. ముంబై నేపథ్యంలో సాగే ఈ సీరీస్ పది ఎపిసోడ్లుగా ఉంటుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ సీరీస్ ని వచ్చే ఏడాది నుంచి స్ట్రీమింగ్ చేస్తారు.