జగన్ వైఫల్యాలకు మారుపేరులా నిలిచారు: కేశినేని శ్వేత
- మూడు రాజధానుల నిర్ణయం మూర్ఖత్వంతో తీసుకున్నది
- రైతుల కోసం విజయవాడ యువకులు సైన్యంగా వచ్చారు
- ఈ సైన్యం సునామీలా మారితే జగన్ తట్టుకోగలరా?
అమరావతి కోసం విజయవాడ యువకులు ఒక సైన్యంగా ముందుకు వచ్చారని శ్వేత చెప్పారు. ఈ సైన్యం ఒక సునామీగా మారితే తట్టుకునే శక్తి ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు. కరోనా కేసులు నమోదవుతున్న సమయంలో కూడా ప్రాణాలకు తెగించి రైతులకు మద్దతు పలికేందుకు తాము వచ్చామని చెప్పారు. ఇప్పటి వరకు గుప్పెడు ఇసుకను కూడా ప్రజలకు జగన్ ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. వైఫల్యాలకు మారుపేరులా నిలిచిన జగన్... మూడు రాజధానులను ఎలా నిర్మించగలరని అన్నారు.