భర్తతో కలిసి 'ఆచార్య' సెట్లో కాజల్ సందడి... కొత్తజంటను ఆశీర్వదించిన చిరంజీవి
- ఇటీవలే పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్
- వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో వివాహం
- కాజల్ దంపతులకు స్వాగతం పలికిన 'ఆచార్య' యూనిట్
- సెట్స్ పై పూలదండలు మార్పించిన చిరంజీవి
- కేట్ కట్ చేయించి అభినందనలు తెలిపిన వైనం
ఈ సందర్భంగా ఆమెకు చిత్రయూనిట్ ఘనస్వాగతం పలికింది. చిరంజీవి కొత్త దంపతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛాలు అందించి, దండలు మార్పించారు. సెట్స్ పై కేక్ కట్ చేయించి కాజల్, గౌతమ్ జోడీకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కొరటాల శివ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం 'ఆచార్య' షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లోనే జరుగుతోంది.