ఈ విషయంలో నేను సిగ్గు పడటం లేదు: సంజయ్ దత్ కూతురు త్రిషాల
- గతంలో మా నాన్న డ్రగ్స్ కు అలవాటు పడ్డారు
- దాని గురించి ఆయన ఒప్పుకున్నారు
- బయటపడేందుకు సహాయం కూడా కోరారు
తన తండ్రి గతంలో డ్రగ్స్ కు అలవాటు పడినా... దాన్నుంచి బయటపడ్డారని త్రిషాలా అన్నారు. డ్రగ్స్ తీసుకుంటున్నానని తనకు తానుగా ఒప్పుకోవడమే కాకుండా, దాన్నుంచి బయటపడటానికి సహాయం కోరారని, అది చాలా గొప్ప విషయమని చెప్పారు. ఈ విషయంతో తాను సిగ్గుపడటం లేదని అన్నారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని చెప్పారు.