నిహారిక పెళ్లి రోజున... తన పెళ్లి బ్రేకప్ పై రేణు దేశాయ్ వ్యాఖ్యల వీడియో!
- వివాహం విఫలమైతే ఇద్దరిదీ బాధ్యతే
- కొత్త ఇంట్లో అడుగు పెడితే చీకటిగా అనిపిస్తుంది
- మానసిక ధైర్యంతో బయటకు రావాల్సి వుంటుంది
- వివాహం బ్రేకప్ కు కర్మ కూడా కారణమేనన్న రేణు
చాలా సార్లు చాలా మంది తమ భర్త మంచిగా లేరని తెలిసి కూడా అతనితో మంచిగా ఉండేందుకే ప్రయత్నిస్తారని చెప్పిన రేణూ దేశాయ్, అది భారతీయ మహిళలకు అలవాటై పోయిందని వ్యాఖ్యానించారు. ఏ వివాహమైనా బ్రేకప్ అయిందంటే, దానికి ఏదో ఒక కారణం ఉంటుందని, దాన్ని కర్మ అని కూడా అనుకోవచ్చని భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ముందడుగు వేయాలని అన్నారు.
తాను ఈ అడుగులన్నీ వేసుకుంటూనే వచ్చానని, అందరి ఆశీర్వాదంతో కొత్త జంట జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటున్నానని ఎవరి పేర్లనూ ప్రస్తావించకుండానే నిహారిక, చైతన్య దంపతులకు తన విషెస్ అందించారు. కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న వేళ ఎంతో చీకటిగా అనిపిస్తుందని, కానీ ఆ చీకటి నుంచి మానసిక దృఢత్వం, స్వయంకృషితోనే బయటకు రావాలని అభిలషించారు. ఎవరో వచ్చి సాయం చేస్తారని అనుకోవద్దని, వారు సాయం చేసినా, ఎవరికి వారే సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యాన్ని కలిగి వుండాలని సూచించారు. రేణు దేశాయ్ వ్యాఖ్యల వీడియోను మీరూ చూడవచ్చు.