సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- కొత్త ప్రాజక్టులకు ఓకే చెప్పిన అనుష్క
- ఫిబ్రవరి నుంచి డా.రాజశేఖర్ షూటింగ్
- విజయ్ దేవరకొండ 'ఫైటర్' అప్ డేట్
* డా.రాజశేఖర్ హీరోగా నీలకంఠ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రాజశేఖర్ కరోనా నుంచి కోలుకుని ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నందున ఫిబ్రవరి నుంచి ఈ చిత్రం షూటింగును నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మలయాళంలో వచ్చిన 'జోసెఫ్' చిత్రానికి రీమేక్ గా ఇది రూపొందుతుంది.
* పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న 'ఫైటర్' చిత్రం చివరి షెడ్యూలు షూటింగ్ వచ్చే నెల నుంచి ముంబైలో జరుగుతుంది. తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.