మెగాబ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక వివాహం ఈ నెల 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరగనుంది. ఈ పెళ్లి కోసం మెగా కుటుంబ సభ్యులు ఉదయ్ పూర్ కు తరలి వెళుతున్నారు. ఇవాళ అల్లు అర్జున్ తన తల్లిదండ్రులతో కలిసి కుటుంబ సమేతంగా చార్టర్డ్ విమానంలో ఉదయ్ పూర్ వెళ్లారు. ఆయన సోదరులు వెంకట్, శిరీష్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఉదయ్ పూర్ ప్యాలెస్ లో ఈ ముగ్గురు బ్రదర్స్ సందడి మామూలుగా లేదు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.