ఈసారి తనకు పీసీసీ చీఫ్ పదవి ఖాయమంటున్న కోమటిరెడ్డి.. రేసులో పలువురు నేతలు!
- చక్కర్లు కొడుతున్న రేవంత్‌రెడ్డి, భట్టి, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి పేర్లు
- పరిగణనలోకి సామాజిక సమీకరణాలు
- పార్టీలో సుదీర్ఘంగా ఉన్న వారికే ఇవ్వాలంటున్న నేతలు
అలాగే, తెలంగాణకు భవిష్యత్ నాయకుడిగా చెప్పుకుంటున్న రేవంత్‌రెడ్డి కూడా పీసీసీ పదవిని ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. అయితే, సామాజిక సమీకరణాలను బట్టి శ్రీధర్‌బాబు, భట్టి విక్రమార్క సహా మరికొందరి పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 2023 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త సారథి నియామకం ఉంటుందని చెబుతున్నారు. అయితే, సుదీర్ఘంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికే పీసీసీ పగ్గాలు అప్పగించాలని పార్టీ నేతలు కోరుతున్నట్టు సమాచారం.