ఓటమిపాలైన ఉప్పల్ ఎమ్మెల్యే అర్ధాంగి... విజయం సాధించిన మేయర్ భార్య
- జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు
- ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి భార్య స్వప్నపై చేతన విజయం
- చర్లపల్లిలో బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి జయభేరి
కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ పై తాజా సమాచారం ప్రకారం... టీఆర్ఎస్ ఇప్పటివరకు 44 డివిజన్లను కైవసం చేసుకుని మరో 14 డివిజన్లలో గెలుపు దిశగా దూసుకువెళుతోంది. ఎంఐఎం 38 డివిజన్లలో విజయం నమోదు చేసుకుని 4 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 34 డివిజన్లలో గెలిచి మరో 13 డివిజన్లలో ముందంజలో నిలిచింది. కాంగ్రెస్ కు రెండు డివిజన్లు దక్కాయి.