మరో విమానాశ్రయం ఎందుకు కట్టాలనుకుంటున్నామో మీ పేపర్ లో వచ్చిన వార్తే చెబుతోంది కదా !: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు విజయసాయి చురక
- భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు
- మరో విమానాశ్రయం ఎందుకంటూ విమర్శలు
- ట్విట్టర్ లో స్పందించిన విజయసాయిరెడ్డి
"ఏబీఎన్ రాధాకృష్ణా... మీకో విషయం గుర్తుచేస్తున్నాను. 11/6/18న ఈ వార్త మీ అభిప్రాయ దినపత్రికలో వచ్చింది. విశాఖ ఎయిర్ పోర్టులో పౌర విమానాల ఫ్లయింగ్ అవర్స్ పై నేవీ ఆంక్షలు విధించిందని మీ పత్రికలో పేర్కొన్నారు. మరో విమానాశ్రయం ఎందుకు కట్టాలనుకుంటున్నామో మీ పేపర్ లో వచ్చిన వార్తే చెబుతోంది కదా" అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.