నాగ చైతన్య విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన రకుల్ ప్రీత్ సింగ్!
- ‘గ్రీన్ ఇండియా’ చాలెంజ్‌లో పాల్గొన్న రకుల్
- మొక్కలు నాటి, వాటికి నీళ్లు పోస్తూ ఫొటోలు
- తన ఫ్యాన్స్ అందరికీ చాలెంజ్
చాలా కాలం తర్వాత రకుల్ ఈ చాలెంజ్ లో పాల్గొంది. మొక్కలు నాటి, వాటికి నీళ్లు పోస్తూ ఫొటోలు దిగి పోస్టు చేసింది. తాను నటులకి చాలెంజ్ చేయబోనని, తన ఫ్యాన్స్ అందరికీ చాలెంజ్ చేస్తున్నానని రకుల్ చెప్పుకొచ్చింది. అందరూ మూడేసి మొక్కలు నాటాలని సూచించింది. తనకు ఈ అవకాశం కల్పించేలా గ్రీన్ ఇండియా చాలెంజ్ ను ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపింది.