తమన్నా వెబ్ సీరీస్ టైటిల్ 'ఎలెవెంత్ అవర్'.. పోస్టర్ విడుదల
- 'ఆహా' ఓటీటీ కోసం తమన్నా వెబ్ సీరీస్
- 'గరుడ వేగ' ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం
- త్వరలోనే వెబ్ సీరీస్ స్ట్రీమింగ్
ఆమధ్య రాజశేఖర్ తో 'గరుడ వేగ' వంటి యాక్షన్ చిత్రాన్ని చేసిన ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ప్రదీప్ యు. నిర్మిస్తున్న ఈ వెబ్ సీరీస్ కి 'ఎలెవెంత్ అవర్' (11th HOUR) అనే టైటిల్ని ఖరారు చేశారు. దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్ని ఈ రోజు విడుదల చేశారు. త్వరలోనే దీని స్ట్రీమింగ్ మొదలవుతుంది.
ఇదిలావుంచితే, ఇటీవల కరోనా బారిన పడిన తమన్నా ఇప్పుడు పూర్తిగా కోలుకుని మళ్లీ షూటింగులకు హాజరవుతోంది. మరోపక్క కొత్త సినిమాలకు కథలను కూడా వింటోంది.