రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల
- తన తండ్రి కోలుకుంటున్నారని తెలిపిన రాజశేఖర్ కుమార్తె
- శరీరం చికిత్సకు సహకరిస్తోందన్న వైద్యులు
- వైద్య బృందం పర్యవేక్షిస్తోందని బులెటిన్ లో వెల్లడి
రాజశేఖర్ మాత్రం ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వార్తలు రావడంతో అందరూ షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్యం బాగుందని ఆయన కుమార్తె శివాత్మిక తెలిపారు. డాడీ కోలుకుంటున్నారని ఆమె ట్వీట్ చేశారు. హైదరాబాదులోని సిటీ న్యూరో ఆసుపత్రి బృందం తన తండ్రి ఆరోగ్యం కుదుటపడటానికి ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. దీంతో పాటు సిటీ న్యూరో ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ను షేర్ చేశారు.
'రాజశేఖర్ కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తోంది. వైద్యుల బృందం ఆయనను పర్యవేక్షిస్తోంది. హై ఫ్లో ఆక్సిజన్ ను ఆయనకు అందిస్తున్నాం' అని బులెటిన్ లో డాక్టర్లు పేర్కొన్నారు.