అజ్ఞాతంలో దీపిక మేనేజర్.. కఠిన చర్యలు తప్పవన్న ఎన్సీబీ!
- కరిష్మా ఇంట్లో డ్రగ్స్ లభ్యం
- సమన్లు పంపిన ఎన్సీబీ
- అప్పటి నుంచి కనిపించకుండాపోయిన కరిష్మా
దీనిపై ఎన్సీబీ అధికారులు స్పందిస్తూ విచారణకు హాజరుకాకపోవడం వల్ల కరిష్మా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఆమెపై కఠినమైన చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు 23 మందిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని కూడా అరెస్ట్ చేసింది. నెల రోజుల తర్వాత జైలు నుంచి ఆమె బెయిల్ పై విడుదలైంది.