హీరోయిన్ దీపికా పదుకునే మేనేజర్ ఇంట్లో డ్రగ్స్ స్వాధీనం
- రెండు బాటిళ్ల లిక్విడ్ సీఎన్బీ స్వాధీనం
- విచారణకు హాజరు కావాలని ఆదేశం
- కొంత కాలంగా దీపిక, ఆమె మేనేజర్ పై నిఘా
దీపికా పదుకునే మేనేజర్ కరిష్మా ప్రకాశ్ ఇంట్లో ఎన్సీబీ అధికారులు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రెండు బాటిళ్ల లిక్విడ్ సీఎన్బీ దొరికినట్టు అధికారులు తెలిపారు. అయితే, తనిఖీలు జరిగిన సమయంలో కరిష్మా లేకపోవడంతో... విచారణకు హాజరుకావాలని ఆమె ఇంటికి అధికారులు నోటీసులు అతికించారు. డ్రగ్స్ విచారణలో వాట్సప్ చాటింగ్ లో డీ, కే అనే పదాలను అధికారులు గుర్తించారు. ఇందులో డీ అంటే దీపికా, కే అంటే కరిష్మాగా అధికారులు గుర్తించారు. అప్పటి నుంచి వారిపై నిఘా ఉంచిన అధికారులు చివరకు కరిష్మా ఇంట్లోనే డ్రగ్స్ ను గుర్తించారు.