రాజశేఖర్ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేసిన సిటీ న్యూరో సెంటర్ డాక్టర్లు
- రాజశేఖర్ ఐసీయూలో ఉన్నారు
- ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది
- చికిత్సకు ఆయన స్పందిస్తున్నారు
ఇదే సమయంలో డాక్టర్లు కూడా రాజశేఖర్ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేశారు. రాజశేఖర్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని చెప్పారు. ఓ వైద్య బృందం ఆయననే నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు. తమ చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని చెప్పారు. రాజశేఖర్ భార్య జీవిత కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు. ఈరోజు చేసిన కోవిడ్ పరీక్షలో నెగెటివ్ రావడంతో ఆమెను డిశ్చార్జి చేశామని చెప్పారు.